మృతుల కుటుంబాలకు పది లక్షలు ఇవ్వండి

న్యూఢిల్లీ, 25 జూన్‌ 2013:

ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతి చెందిన ఒక్కొక్క తెలుగు వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరదల్లో బాధితులైన వారిని వారి స్వస్థలాలకు చేర్పించేందుకు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ. 50 వేలు అందించాలని ఆయన కోరారు. ఢిల్లీలోని ఎ.పి. భవన్‌లో ఆశ్రయం పొందుతున్న మన రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్ వరద బాధితులను ఇంద్రకర‌ణ్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రజలను ఆగమేఘాల మీద ఆదుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిద్రమత్తులో జోగుతున్నదని అల్లోల తీవ్రంగా విమర్శించారు.

Back to Top