- టీడీపీ, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలు
- హోదా రాకుండా బాబు అడ్డుపడుతున్నాడు
- టీడీపీ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి
- వైయస్సార్సీపీ నేతలు గౌతంరెడ్డి, ఉదయభాను
విజయవాడః ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైయస్సార్సీపీ నేతలు గౌతంరెడ్డి, సామినేని ఉదయభానులు మండిపడ్డారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతిని పెంచిపోషిస్తున్నారని దుయ్యబట్టారు.
మరిన్ని విషయాలు వారి మాటల్లోనే...
- బాబు రాష్ట్రంలో అవినీతికి పెద్దపీట వేశారు. ఆడిన మాట తప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే.
- ప్రత్యేకహోదా విషయంలో బాబు అబద్ధాలను పెంచి పోషిస్తున్నారు.
- ప్రత్యేకహోదా కోసం మొట్టమొదట స్పందించిన వ్యక్తి వైయస్ జగన్ ఒక్కరే. ఢిల్లీలో నిరసన దీక్ష చేశారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు సహా నిరవధిక నిరాహార దీక్ష చేశారు.
- హోదా విషయంలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కై నాటకాలాడుతున్నాయి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలనే వైయస్ జగన్ ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు.
- బంద్ కు కార్మిక, విద్యార్థి, మహిళా, ప్రజసంఘాలు అందరూ మద్దతిచ్చారు. సినీ, ఆర్టీసీ, ట్రాన్స్ పోర్టు, విద్యాసంస్థలు అందరూ కలిసి రావాలని కోరుతున్నాం.
- బంద్ వద్దని బాబు చెబుతున్నారు...కృష్ణా పుష్కరాల సమయంలో అన్నీ మూసేయాలని బాబు చెప్పడం హర్తాల్ కాదా.
- బాబు నీవు ప్రతిపక్షంలో ఉంటే ఇష్టమొచ్చినట్లు బంద్ లకు పిలుపునిస్తావు. అదే వేరొకరు ఇస్తే సమర్థించవా..?
- ఏపీ బంద్ అన్నది వైయస్సార్సీపీ కార్యక్రమం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించినది.
- ప్రజాస్వామ్యయుతంగా బంద్ చేపట్టి తీరుతాం. బాబు మొండి వైఖరి మార్చుకోవాలి.
- రాష్ట్ర బంద్ ను పూర్తిగా విజయవంతం చేయాల్సిన అవసరం ప్రజానీకంపై ఉంది.
- హోదా సంజీవని కాదంటూ బాబు మాట్లాడడం వల్లే బీజేపీ హోదా ఇవ్వడం లేదు.
- కేంద్రంపై ఒత్తిడి తేకుండా బాబు హోదాపై నటిస్తున్నారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా వ్యవహారాన్ని ప్రజలు గమనించారు
- హోదా రావడం బాబుకు ఇష్టం లేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇచ్చాక బాగా అభివృద్ధి చెందింది. దాంతో, మరో 5 ఏళ్లు పొడిగించాలని వారు కోరుతున్నారు
- విభజన చట్టంలో పెట్టిన విధంగా ఏపీకి హోదా ఇచ్చి తీరాలి
- లక్షా 90 వేల కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చామని చెబుతుంటే. బాబేమో 2 వేల కోట్లు మాత్రమే ఇచ్చారంటూ ప్రజలను తికమకపెడుతున్నారు.
- స్పష్టంగా అడుగుతున్నాం. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి,
- ఆర్నెళ్ల ముందు చేయాల్సిన పుష్కర పనుల్ని హడావిడిగా చేస్తూ టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు.
- నీరు-చెట్టు సహా అన్ని శాఖలు అవినీతిమయమైపోయాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి.
- టీడీపీ నేతల అవినీతిని చంద్రబాబు చూసీ చూడనట్టు ఉండమంటున్నారని అధికారులు చెబుతున్నారంటేనే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.
- హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తక్షణమే ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని వైయస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.