బాబు మాటలు నమ్మి మళ్లీ మోసపోం




జననేత ఎదుట కన్నీరుపెట్టుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులు
ఆదుకోవాలని వేడుకున్న ఆడపడుచులు
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా అగ్రిగోల్డ్‌ బాధితులు కనిపిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బాధితులు కలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తమను ఆదుకోవాలని, జీవితాలు రోడ్డున పడ్డాయంటూ వాపోతున్నారు. సిక్కోలు నియోజకవర్గం నడిగూరు గ్రామంలోని 300 పైచిలుకు అగ్రిగోల్డ్‌ బాధితులు జననేతకు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రూ. 10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశామని, డబ్బులు రాక బాధితులు అనేక మంది ఆత్మహత్యలు, మరికొంత మంది మనస్తాపంతో మంచానపడ్డారన్నారు. దాచుకున్న డబ్బులు చేతికందక పిల్లల పెళ్లీళ్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. న్యాయం కోసం ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నాడన్నారు. హాయ్‌ల్యాండ్‌ను అగ్రిగోల్డ్‌ సంస్థది అని మొదట్లో ప్రకటించారని, కానీ చినబాబు లోకేష్‌తో రహస్య ఒప్పందాలు చేసుకొని హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తి కాదని చెప్పిస్తున్నారన్నారు. ఆడపడుచులకు న్యాయం చేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోలేదన్నారు. అగ్రిగోల్డ్‌ డబ్బులు ఇప్పిస్తేనే చంద్రబాబు పార్టీ బతికిబట్టకడుతుందన్నారు. 

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందని అగ్రిగోల్డ్‌ బాధితులు అన్నారు. తమ సమస్య చెప్పిన వెంటనే చెలించారని, మన ప్రభుత్వం వచ్చాక వెంటనే ఆదుకుంటామని భరోసా ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌కు ఓటు వేసి గెలిపించుకుంటామన్నారు. చంద్రబాబు నమ్మితే తమను నట్టేట ముంచాడని, ఇంకోసారి ఆయన మాయమాటలు నమ్మి మోసపోమని అగ్రిగోల్డ్‌ బాధితులు ముక్తకంఠంతో చెప్పారు.
Back to Top