చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందయ్యా..




వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులు
విజయనగరంః అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాలంటూ వైయస్‌ జగన్‌కు బాధితులు వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం తమను నట్టేట ముంచిందని కన్నీరు మున్నీరయ్యారు. చంద్రబాబు సర్కార్‌లో న్యాయం జరుగుతుందన్న ఆశపోయిందన్నారు.రాష్ట్రవాప్తంగా 19 లక్షల బాధితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చావలేక బతుకుతున్నామని వాపోయారు.

హైస్కూల్‌ చదువుతున్న బాలికలకు సైకిళ్లు ఇస్తామన్నారన్నా. కానీ నేటికీ ఇవ్వలేదు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేం చాలా దూరం నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీని వల్ల స్కూల్లో చెప్పే తరగతులకు ఆలస్యమవుతున్నాం. మీరు ముఖ్యమంత్రి అయ్యాక సైకిళ్లు నిర్ణీత సమయానికే ఇవ్వండన్నా.. అని విద్యార్థినులు కోరారు.
 
Back to Top