జగన్మోహన్ రెడ్డికి సాయంగా ఉంటాం

హైదరాబాద్  30 ఆగస్టు 2013:

సమన్యాయం చేయాలంటూ గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి సాయంగా ఉండేందుకు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతికి అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది శుక్రవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు సైతం కుటుంబ సభ్యులను అనుమతించటం లేదు. మరోవైపు శ్రీ జగన్ దీక్ష, రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ  శుక్రవారం లోటస్ పాండ్లో సమావేశమైంది. తాజా రాజకీయ వ్యవహారాలను కమిటీ పరిశీలించింది.

Back to Top