52వ రోజు పాదయాత్ర ప్రారంభం

మహబూబ్ నగర్: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 52వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. కేసంపేటలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ఆమె బయలుదేరారు. ఆల్వాల్ గ్రామంలో మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. ఆమె వెంట పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, అభిమానులు ఉన్నారు.

Back to Top