<br/><br/><br/>కాకినాడః రాష్ట్రవిభజన అనంతరం ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదా విషయంలో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం,ఇటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేసిన వంచనలపై వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న వంచనపై గర్జన సభ జరగనుంది.ఇప్పటికే రాష్ట్రంలోనూ విశాఖపట్నం,నెల్లూరు,అనంతపురం,గుంటూరు జిల్లాల్లో వంచనపై గర్జన సభలు జరిగాయి.ఐదవ సభగా కాకినాడలో జరిగే సభకు వేలాది మంది తరలిరావాలని వైయస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చింది.విభజనతో పాటు పదేళ్లు పాటు హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు దాటుతుందని,విభజన చట్టంలో హామీలను కూడా నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ విమర్శించింది.ఎన్నికలలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా టీడీపీ దుష్టపాలన సాగిస్తుందని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.