ట్రస్ట్ నుంచి సింధుకు రెండెకరాల భూమి

హైదరాబాద్: ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు వైయస్సార్సీపీ నేత విజయ్ చందర్ రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు. పీవీ సింధు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేతుల మీదుగా డాక్యుమెంట్స్ అందజేస్తామని విజయ్ చందర్ తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top