<strong>వైయస్‌ఆర్ జిల్లా, 19 నవంబర్ 2012:</strong> చిత్రావతి రిజర్వాయరు నుండి 0.953 టిఎంసీల నీటిని విడుదల చేయాలని వైయస్‌ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సోమవారంనాడు కలెక్టర్‌కు ఒక లేఖ రాశారు. సాగునీటికి అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో ఆమె కలెక్టర్‌కు వివరించారు. ఇబ్బందులు పడుతున్న రైతన్నల పొలాలకు తక్షణమే 0.953 టిఎంసిల నీటిని విడుదల చేయాలని విజయమ్మ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.