యూకేలో ఘ‌నంగా వైయ‌స్ జగన్‌ జన్మదిన వేడుకలు



అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  జన్మదిన వేడుకలను యూకేలో అభిమానులు ముందస్తుగా జరుపుకున్నారు. యూకేలో తెలుగు అసోసియేషన్‌ సభ్యులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. డిసెంబర్‌ 21న వైయ‌స్‌ జగన్‌ పుట్టిన రోజు కాగా, ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు. ఏపీలో వచ్చేది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమేనంటూ ..కాబోయే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అంటూ నిన‌దించారు. కార్య‌క్ర‌మంలో యూరప్ వింగ్ నాయకులు డాక్ట‌ర్‌ ప్రదీప్ రెడ్డి చింతా, ఓబుల్‌రెడ్డి పాతకోట,  ఎన్ఆర్‌ రెడ్డి, పీసీ రావు కోడె, దాదాపు 300 మంది వైయ‌స్ జ‌గ‌న్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 
Back to Top