వైయస్‌ఆర్‌సీపీ పరిశీలకుల సమావేశం ప్రారంభం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌కుల స‌మావేశం కొద్దిసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో నియోజకవర్గాల వైయస్‌ఆర్‌సీపీ పరిశీలకులకు పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేస్తున్నారు. నియోజవర్గాలలో పరిస్థితులు, దొంగ ఓట్ల తొలగింపు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వైయస్ఆర్‌సీపీ విజయం ఖాయమైందని వైయస్ జగన్ పరిపాలనపై ప్రజల అంచంచల విశ్వాసమే పార్టీ విజయానికి కారణం కాబోతుందని పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేశారు. తాడేపల్లిలో వైయస్ఆర్‌సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం గురువారం జరిగింది . రాష్ర్ట ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్టీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీని రానున్న 9 నెలల కాలంలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో సవివరంగా తెలియచేశారు. పార్టీ విజయం ఖాయమైంది కదా అని ఏమాత్రం ఏమరపాటు పనికిరాదన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి ఒడిగడుతూ ఎన్ని కుయక్తులు పన్నినా ప్రజలు శ్రీ వైయస్ జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని డిసైడ్ అయ్యారన్నారు. ముఖ్యంగా  చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ వంటి వారు చెబుతున్న మాటలను విశ్వసించే స్దితిలో ప్రజలు లేరన్నారు. అందుకే వాళ్ళు ఏమీ పాలుపోని స్దితిలో అర్దంపర్దంలేని ఆరోపణలతో అయోమయం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులన్నీ విభేదాలకు తావులేకుండా ఐకమత్యంతో  పనిచేసేలా చేయాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులుగా నియమితులైన వారిపై ఉందన్నారు. శ్రీ వైయస్ జగన్ రాష్ర్టంలో అమలు చేస్తున్న పధకాలు,అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన పట్ల ప్రజలంతా సంతృప్తితో ఉన్నారన్నారు.మా పధకాలు,మా పారదర్శకపాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతూ శ్రీ వైయస్ జగన్ ప్రకటించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

        ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలం ఎంతో కీలకమైందనే విషయం పరిశీలకులు గుర్తించాలన్నారు. అందువల్ల ఏ నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమితులయ్యారో ఆ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో ఎంఎల్ఏ కు,నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ కి తలలో నాలుకలాగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సహాయకారిగా ఉండాలన్నారు. ముఖ్యంగా మొదటగా బోగస్ ఓట్లను తొలగించడం,అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించడం వంటివాటిపై దృష్టి సారించాలన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు తన కుయుక్తులతో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారు. వాటిని గుర్తించి ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువచ్చి వాటిని తొలగించేందుకు పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కోరారు.గృహసారధులు,పార్టీ శ్రేణుల సమన్వయంతో  పనిచేసి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల్లో పనిచేయాలన్నారు.ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

     ముఖ్యంగా  నియోజకవర్గంలో కిందిస్దాయి నేతల మధ్య అసంతృప్తి ఉంటే వాటిని గుర్తించడం వారి స్దాయిలోనే పరిష్కారంకోసం కృషిచేయాలన్నారు.ఇంకా అవసరమైతే వాటిని రీజనల్ కోఆర్డినేటర్,పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఇంకా అవసరమైతే కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని కోరారు.

       ప్రస్తుతం మరో కీలకమైన అంశం సోషల్ మీడియా నియోజకవర్గస్దాయిలో సోషల్ మీడియా టీమ్ లను బలోపేతం చేసే దిశగా పరిశీలకులు దృష్టి సారించాలన్నారు.ఆయా నియోజకవర్గాలలో ప్రజలకు అందుతున్న పధకాలను,వాటి లబ్దిని ఇతర అభివృద్ది పనులను ప్రజలకు వివరించేలా సోషల్ మీడియా పనిచేయాలని కోరారు.అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.

             మనకు అప్పగించిన  బాధ్యతే మన అధికారం అనేది పరిశీలకులు గుర్తించాలన్నారు. పరిశీలకులు నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతరం  అసెంబ్లీ అభ్యర్ది,ఎంఎల్ ఏ,నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు... పరిశీలకులపై డిపెండ్ అవ్వడం మొదలుపెడితే అదే అధికారం అవుతుంది.రీజనల్ కోఆర్డినేటర్ పరిశీలకులతో మాట్లాడేలాగా పరిశీలకులు చెబుతున్న సమాచారం ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో యాక్షన్ టేకప్ చేసినా అదే పరిశీలకులకు తగిన గుర్తింపు అవుతుంది.క్రియాశీలకంగా మనస్సు పెట్టి పనిచేయాలని అన్నారు.రానున్న9 నెలల కాలంలో పనిచేసిన అనంతరం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక పరిశీలకులందరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటికే పరిశీలకులుగా ఉన్న వారంతా కూడా గతంలో ఎంఎల్సిలుగా, ఎంఎల్ఏ లుగా,మున్సిపల్ ఛైర్మన్ లుగా,పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారేనని అన్నారు. కాబట్టి పరిశీలకులకు పార్టీ అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారిలో నాయకత్వ పటిమను నిరూపించుకోవాలన్నారు.

           రాజకీయం అంటే ప్రజలకు నిస్వార్ధంగా సేవచేయడమే అనే భావన పార్టీ శ్రేణులలో ఉండాలి. శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు తనకు 151 స్దానాలు ఇచ్చారనే భావనతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం లేదు. ప్రజలకు మరింతగా మేలు చేయాలనే ఉద్ధేశ్యంతో ముందుకు వెళ్తున్నారు.  అదికారం ఇచ్చారు కదా అని ఎంజాయ్ చేయడంలేదు. ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో పనిచేస్తున్నారు. పవర్ అనేది బాధ్యతే.... ఎంజాయ్ చేయడానికి  కాదు.  ప్రజల అవసరాలను గుర్తించి  వాటిని నెరవేర్చేదిశగా శ్రీ వైయస్ జగన్  ముందుకు వెళ్తున్నారు. అప్పగించిన పని నెరవేర్చడం. రాష్ర్ట భవిష్యత్తుని నిర్దేశించడంలో వైయస్సార్ సిపి చేసే పనిలో మనం కూడా భాగం అయ్యామనే భావనలో తాను శ్రీ వైయస్ జగన్ అప్పగించిన పనిని నెరవేరుస్తుంటానని శ్రీ సజ్జల అన్నారు. పరిశీలకులు కూడా ఇదే భావనతో పనిచేయాలని కోరారు.

      సమావేశంలో పాల్గొన్న పరిశీలకులు నియోజకవర్గ పరిస్దితులను వివరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.ఈ సందర్బంగా పలువురు పరిశీలకులు మాట్లాడుతూ నియోజకవర్గాలలో పార్టీ పరిస్దితులను వివరించారు. పార్టీకి చాలా సానుకూలంగా వాతావరణం ఉందని ఇందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందిస్తున్న పధకాలు,పారదర్శకపాలన దోహదం చేస్తున్నాయని ఇదే అంశాన్నిప్రజలు తమతో తెలియచేశారని వారు వివరించారు. అయితే క్షేత్ర స్దాయిలో పార్టీలో చిన్న చిన్న విభేదాలు పరిష్కరించాలంటే ఏం చేయాలో వారు పలు సూచనలు సలహాలు తెలియచేశారు. వాటిని తగిన విధంగా పరిష్కరిస్తామని,శ్రీ వైయస్ జగన్  దృష్టికి తీసుకువెళ్తామని   సజ్జల రామకృష్ణారెడ్డి వారికి తెలియచేశారు.

         సమావేశం అనంతరం మీడియాప్రతినిధులతో  పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు  లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్ గారి ఆలోచన,పరిపాలనను దృష్టిలో పెట్టుకుని రాష్ర్టంలో 175 అసెంబ్లీ స్ధానాలకు 175 స్దానాలను వైయస్ఆర్‌సీపీ గెలుచుకోవాలనే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలనే ధ్యేయంతో రాష్ర్ట స్దాయిలో పరిశీలకుల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అబధ్దపు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా వాస్తవాలు ప్రజలకు తెలియచేసి చైతన్యవంతం చేయాలని ఇందుకు తగిన విధంగా పరిశీలకులు పనిచేయాలని కోరామన్నారు. పరిశీలకులు పార్టీకి మేలు చేసే విధంగా పనిచేయాలని,ఎక్కడా కూడా అధిపత్యధోరణులు ఉండకూడదన్నారు. ప్రతి పరిశీలకులు వ్యవహరించేతీరు పార్టీకి మేలు కలిగేవిధంగా పార్టీ విజయంలో భాగస్వాములయ్యేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కమిటీల నియామకం,ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించడం,సోషల్ మీడియా టీమ్ లను బలోపేతం చేయడంలో కూడా పరిశీలకులు దృష్టిపెట్టాలని కోరామన్నారు. ఎస్సిఎస్టిబిసి మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న శ్రీ వైయస్ జగన్ కు తిరిగి రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయా వర్గాలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయని తెలియచేశారు. కార్యకర్తలందరిని ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో పరిశీలకులకు తెలియచేయడం జరిగిందన్నారు.

 

Back to Top