నెల్లూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు వింటేనే ప్రజలంతా తన్మయంతో పులకించిపోతున్నారని, ఈ సారి యువ నాయకుడికి అవకాశం ఇద్దామని ఎదురుచూస్తున్నారని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సమర శంఖారావం సభ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్ధాలను ధైర్యంగా చెబుతున్నారని, టెక్నాలజీని దుర్మార్గపు పనులకు ఉపయోగిస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలని కుట్రలు చేస్తున్నాడని, చంద్రబాబు ఎలాంటి వాడో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని మత్స్యకారుల నియోజకవర్గానికి వెళ్తే తిరనాళ్లుగా ప్రజలంతా వచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించి పట్టం కడతారన్నారు. ఒక్కసారి యువనాయకుడికి అవకాశం ఇద్దామని చూస్తున్నారన్నారు. ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎన్నికలు జరగాలని కోరారు. తప్పనిసరిగా వైయస్ జగన్‌కు గొప్ప విజయం చేకూరుతుందన్నారు.