వైయస్‌ జగన్‌ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
 

తాడేపల్లి: రాష్ట్ర ప్రజలంతా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో సంతోషంగా ఉన్నారని, అందరూ వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారని పార్టీ సీనియర్‌ నేత అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత రామసుబ్బారెడ్డి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అనంతరం అమర్‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ తొమ్మిది నెలల్లోనే ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన హామీలన్ని పూర్తి చేశారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతిపక్ష నాయకులే మేం పోటీ చేయడం లేదన్నారు. చంద్రబాబు కూడా అవకాశం ఉన్న చోట పోటీ చేస్తామని చెప్పారు. ప్రజానీకమంతా వైయస్‌ఆర్‌సీపీని ఆదరిస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా వైయస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులవుతున్నారు. టీడీపీ నేత రామసుబ్బారెడ్డి  వైయస్‌ఆర్‌సీపీలో చేరడం సంతోషం. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతమైంది. వైయస్‌ఆర్‌సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top