ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం వైయ‌స్ జగన్‌ జన్మదిన వేడుకలు

 
మెల్‌బోర్న్‌: ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైయ‌స్సార్‌సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైయ‌స్సార్‌సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, వైయ‌స్సార్‌సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్‌ వెంకట్‌ మేడపాటి తదితరులు జూమ్‌ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైయ‌స్సార్‌సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది.  

 

Back to Top