కురిచేడులో కదం తొక్కిన మహిళలు

మేమంతా సిద్దం అంటూ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఘనస్వాగతం 

ప్ర‌కాశం జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌కాశం జిల్లా కురిచేడులో మ‌హిళ‌లు క‌దం తొక్కారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా కురిచేడులో బస్సుయాత్రకు సంఘీబావంగా పోటెత్తిన జన ప్రభంజనం. 

కురిచేడు ప్రధానరహదారికి ఇరువైపులా బారులుతీరి ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మహిళలు.

బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి. సీఎం వైయస్‌.జగన్‌తో పాటు కురిచేడు ప్రధాన రహదారిలో జన ప్రవాహం క‌నిపించింది. జ‌య‌హో జ‌గ‌న్ నినాదాల‌తో ఊరూవాడా హోరెత్తుతోంది.

Back to Top