వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ మూక‌ల దాడి

బాధితుల‌పైనే కేసు న‌మోదు

 నెల్లూరు:  కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి అరాచకాలు కొన‌సాగుతున్నాయి. కావలి ఏరియా హాస్పిటల్ లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ మూకల దాడి కేసులో బాధితులపైనే కేసులు న‌మోదు చేశారు.  శివ రాజ్ అనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై హాస్పిటల్ ప్రాంగణంలోనే 20 మంది టీడీపీ గూండాలు దాడికి తెగ‌బ‌డ్డారు. అలాగే కోళ్ల దిన్నె గ్రామంలో గాయపడి హాస్పిటల్ చికిత్స పొందుతున్న శ్రీనివాసులు రెడ్డిపైనా దాడికి యత్నించారు. టీడీపీ మూక‌ల చేతిలో చావు దెబ్బలు తిన్న శివరాజ్, వెంకటేశ్వర్లు, శ్రీహరిలు తమపై టీడీపీ నేతలు దాడి చేశారని పిర్యాదు ఇచ్చినా.. పోలీసులు కేసు తీసుకోలేదు. పైగా బాధితుల‌పైనే పోలీసులు కేసు న‌మోదు చేశారు.  టీడీపీ శ్రేణుల‌దాడిని, పోలీసుల తీరును కావలి మాజీ ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు, ప‌బ్లిక్‌గా ప‌ది మంది క‌లిసి ఒక వ్య‌క్తిని కొట్టారు. ఇంత దారుణంగా దాడులు చేస్తూ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లకు పాల్ప‌డ‌టం స‌రికాద‌న్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా దాడులు జ‌రుగుతున్నాయ‌ని, తీరు మార్చుకోక‌పోతే ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని మాజీ ఎమ్మెల్యే  హెచ్చ‌రించారు. 

Back to Top