వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన రామసుబ్బారెడ్డి

 

తాడేపల్లి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ రామసుబ్బారెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి పార్టీలో చేరారు.

Back to Top