టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ కార్పొరేట్ హాస్పిటళ్ల‌కే! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ నిధుల‌న్నీ చంద్ర‌బాబు దుర్వినియోగం చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు.  'రాష్ట్రంలో కొవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది. ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ కార్నొరేట్ హాస్పిటళ్లకు మళ్లించాడు. ప్రభుత్వ ఆసుప‌త్రుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ మౌలిక వసతుల కొరత వల్లే రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

'పప్పూ... నిన్ను చూస్తే జాలేస్తోంది! మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు... గరుడ పురాణాన్ని నమ్మాడు... చెప్పులు పార్టీని నమ్మాడు... చివరికి దిష్టి రాజు దిబ్బ రాజును కూడా నమ్మాడు... నిన్ను మాత్రం నమ్మలేదు! అయినా, పప్పూ... నువ్వు మాత్రం మీ నాన్ననే నమ్ము' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top