శాశ్వ‌త భూ హ‌క్కు చ‌ట్టంతో సామాన్యుల‌కు మేలు

ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌
 

అమ‌రావ‌తి:  ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌స్తున్న శాశ్వ‌త భూ హ‌క్కు చ‌ట్టంతో సామాన్యుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ పేర్కొన్నారు. భూ య‌జ‌మానికి ఈ చ‌ట్టం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని, ప్ర‌తిప‌క్షం రాజ‌కీయాలు చూడ‌కుండా మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆయ‌న కోరారు. ఏనాటి నుంచో త‌ప్పుప‌ట్టిన రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో ప్ర‌జ‌లు కోర్టుల చుట్టూ తిరిగి అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. శాస‌న ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకొని త్రిబ్యూన‌ల్ ద్వారా రెవెన్యూ రికార్డుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు బిల్లు తీసుకు వ‌స్తున్నారు. దీనిపై టీడీపీ స‌భ్యులు మంచి స‌ల‌హాలు ఇవ్వాల్సింది పోయి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పాత చ‌ట్టాల వ‌ల్ల సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ బిల్లును అంద‌రూ ఆమోదించాలి. రాజ‌కీయాల కోసం విమర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ సూచించారు.

Back to Top