ఆదివాసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద దిక్కు

వైద్యం, విద్య ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

మ‌హిళ‌ల‌కు మ‌నోధైర్యం ఇచ్చిన ఏకైక ప్ర‌భుత్వం ఇదే

ఎమ్మెల్యే క‌ళావ‌తి

అమ‌రావ‌తి:  గిరిజ‌నుల‌కు విద్య‌, వైద్యం ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతున్నార‌ని ఎమ్మెల్యే క‌ళావ‌తి పేర్కొన్నారు. ఆదివాసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద దిక్కు అని ఆమె కొనియాడారు. గురువారం క‌ళావ‌తి అసెంబ్లీలో మాట్లాడారు. పాడేరులో మెడిక‌ల్ కాలేజీ, కురుపాంలో ఇంజినీరింగ్ కాలేజీ, ఐదు ఐటీడీఏల ప‌రిధిలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు,  పీహెచ్‌సీల‌ను 50 ప‌డ‌క‌ల ఆసుప‌త్రులుగా మార్చ‌డం శుభ ప‌రిణామ‌మ‌న్నారు. మాకు ధైర్యం క‌లిగింది. వైయ‌స్ఆర్ చేయూత‌, ఆస‌రా వంటి ప‌థ‌కాలు గిరిజ‌న మ‌హిళ‌ల‌కు భ‌రోసా ఇచ్చింద‌న్నారు. గ‌తంలో మేనిఫెస్టోలో చెప్పి చంద్ర‌బాబు రుణాలు మాఫీ చేయ‌కుండా మోసం చేశారు. గిరిజ‌న కుటుంబాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెలుగులు నింప‌డంతో చైత‌న్య‌వంతం అయ్యామ‌న్నారు. గ‌తంలో తుపాన్లు వ‌స్తే ప‌ట్టించుకునే వారు కాదు. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ 18 ప‌థ‌కాల ద్వారా నేరుగా డ‌బ్బులు అంద‌జేస్తున్నారు. గిరిజ‌నుల భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డం గొప్ప విష‌యం. గిరిజ‌నుల అభివృద్ధికి పెద్ద‌పీట వేసిన ఏకైక ప్ర‌భుత్వం ఇది. గాంధీ జ‌యంతి రోజు ఆర్ వై ఎఫ్ ప‌ట్టాలు ఇచ్చారు. మహిళా సాధికార‌తకు గిరిజ‌నుల్లో పెద్ద పీట వేశారు. మాకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి, గిరిజ‌న స‌ల‌హా మండ‌లి ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకంగా ఎస్టీ క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు. ఈ రోజు గిరిజ‌నుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ రూపంలో పెద్ద దిక్కు ఉంద‌ని సంతోషంగా ఉన్నాం. మ‌హిళ‌ల‌కు మ‌నోధైర్యాన్ని నింపిన ప్ర‌భుత్వం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఆదివాసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద దిక్కుగా నిలిచార‌ని క‌ళావ‌తి కొనియాడారు. 

Back to Top