పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ఆ పార్టీ నేత పట్టాభికి ప్రాణహాని పొంచి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైయ‌స్సార్‌ సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరిత తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

స్థానిక డి కన్వెన్షన్‌లో ద్వారంపూడి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు.  ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయిట్‌మెంట్‌ కోరడంపై స్పందిస్తూ.. ఒకప్పుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించిన చంద్ర బాబు ఈవేళ ఆయన అపాయింట్‌మెంట్‌ కోరడానికి సిగ్గుండాలని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top