అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ
 

గుంటూరు: అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ అన్నారు. ప్లీన‌రీలో ఆమె మాట్లాడుతూ..రైతు భరోసా ద్వారా రైతులకు అండగా నిలిచిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌ది అని ఎ  పేర్కొన్నారు. ‘దివంగత నేత వైయ‌స్సార్‌ ముఖ‍్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే ఈరోజు మారుమూల గ్రామాల్లో నివసిస్తూ పోడు వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు ఆదుకొని దాదాపు లక్షా ముప్పై అయిదు వేల మందికి హక్కు పత్రాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా గిరిజనుల ఇంటి గుమ్మం ముందుకు సంక్షేమ పథకాలను చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు నెరవేర్చారు. 2024 ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి అందరూ  కృషిచేయాలి’ అని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top