‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 14వ రోజు షెడ్యూల్‌

గుంటూరు:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అటు ఎండను, ఇటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సీఎం వైయ‌స్ జగన్‌ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు(శుక్రవారం) ధూళిపాళ్ల నుంచి బయల్దేరి ఏటుకూరు వరకూ దిగ్విజయంగా కొనసాగింది.  ఒకవైపు భారీ వర్షం పడినా సీఎం వైయ‌స్‌ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. 
ఈ యాత్రలో భాగంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ రేపటి(శనివారం)బస్సుయాత్రను నంబూరు బైపాస్‌(రాత్రి బస చేసిన చోటు) నుంచి ప్రారంభిస్తారు.   మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.  అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో  రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు 14వ రోజు బస్సుయాత్ర షెడ్యూల్‌ను వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. 
 

Back to Top