జర్నలిస్టుల ఉద్యమ నేత ఆంజ‌నేయులు మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం

 విజయవాడ: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) విజయవాడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.  నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో చికిత్స నిమిత్తం ఆయన ప్రైవేటు ఆసుత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అంబటి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

Back to Top