సీఎం వైయస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

 
 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌తో మోదీ చర్చించారు.  

మరోవైపు కరోనా నియంత్రణపై సీఎం జగన్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్‌ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top