కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మండల పరిషత్‌ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది.

మధ్యాహ్నం 1 గంటకు కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చేతులు ఎత్తే పద్దతిలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగా వైయ‌స్సార్‌సీపీ అత్యధిక స్థానాలు గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీపీ స్థానాలు కూడా భారీగా వైయ‌స్సార్‌సీపీ తన ఖాతాలో వేసుకోనుంది. 

Back to Top