రాచూరులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం

ఏలూరు జిల్లా: మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు గ్రామం చేరుకుంది. రాచూరులో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్ర‌జ‌లు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. దారిపొడువునా ముఖ్యమంత్రి బస్సుయాత్రకు మేమంతా సిద్దమంటూ బారులు తీరి స్వాగతం పలికారు. రాచూరులో బస్సుదిగిన  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మహిళలు, అవ్వాతాతలతో ముచ్చటించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం వైయస్ జగన్‌ను మహిళలు, అవ్వాతాతలు ఆప్యాయంగా పలకరించారు.

Back to Top