స్థలాలను లాగేసుకుంటున్నారన్నా..

వైయస్‌ జగన్‌ను కలిసిన వంశధార నిర్వాసితులు...
శ్రీకాకుళంః  వంశధార నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు.తమకు సాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్లు నిర్మించుకునేందుకు ఇచ్చిన స్థలాలను బడా బాబులు లాగేసుకుంటున్నారని వాపోయారు.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు.పాకలు వేసుకుని ఉంటున్నామన్నారు. కనీస సదుపాయాలు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నామన్నారు.టీడీపీ నేతలు,కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్నారు.
 


Back to Top