బతుకుదెరువు భార‌మైంది

గుంటూరు :వడ్డెర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు  వైయ‌స్ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వ‌డ్డెర‌లు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వడ్డెరలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కష్టజీవులైన వడ్డెరలు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఆధునిక పరికరాల రాకతో పనులు లేక బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల వెంకట్, ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేష్, బత్తుల అంకమ్మరాజు ఉన్నారు. 
 
 
Back to Top