అర్హత ఉన్నా ఉద్యోగాలు రావడం లేదన్నా..

వైయస్‌ జగన్‌కు గిరిజన నిరుద్యోగ యువత మొర..
విజయనగరంః అర్హత ఉన్నా ఉద్యోగాలు రావడంలేదని పార్వతీపురం ఐటిడిఏ పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిపి తమ సమస్యలు చెప్పుకున్నారు.  చదువుకుని ఖాళీగా కూర్చోవలసి వస్తుందని వాపోయారు. రిజర్వేషన్లు ఉన్నా కాదని గిరిజనేతరులతో పోస్టులు భర్తీ చేస్తున్నారన్నారు.జన్మభూమి కమిటీలు జౌట్‌సోర్సింగ్‌ పోస్టులను లక్షలాది పోస్టులను అమ్ముకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.లక్షలాది రూపాయలు ఖర్చుచేసి చదువుకుని ఉద్యోగాలకు నోచుకోకుండా బతకుతున్నామని కన్నీటిపర్యంతం అయ్యారు. ఉద్యోగం కావాలంటే లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కూడా రావడం లేదన్నారు.
 

Back to Top