బతుకు బండి ఆగిపోయిందన్నా..

వైయస్‌ జగన్‌ను కలిసిన బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితుడు
శ్రీకాకుళంః నాలుగేళ్లుగా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న పైడి భీమవరానికి చెందిన జక్కా మోహన్‌రావు వైయస్‌ జగన్‌ను కలిశారు. తన తన భర్త బ్రెయిన్‌ ట్యూమర్‌తో  మంచానికే పరిమితమయ్యారని, ఇద్దరు ఆడపిల్లలున్న  తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, తమ కుటుంబాన్ని  ఆదుకోవాలంటూ వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకుంది. రెండు సార్లు ఆపరేషన్లు చేయించిన ఫెయిల్‌ అయిందని, కదలలేని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆటో నడుపుకుని జీవనం సాగించే మోహన్‌రావు, అతని సంపాదనే కుటుంబానికి ఆధారంగా ఉండేంది. ఇప్పుడు మంచాన పడటంతో అతని కుటుంబం గడవని పరిస్థితి ఏర్పడిందని బంధువుల తెలిపారు. ఆదుకోమని మంత్రి కళా వెంకట్రావ్‌కు వేడుకున్నా  పట్టించుకోలేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు.సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆర్థికసాయం అందించాలని కోరిన పట్టించుకోలేదన్నారు. ౖ వెయస్‌ జగన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. తప్పకుండా ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ భరోసా ఇవ్వడంతో కాస్త ఊరట చెందుతున్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయన్నారు.
Back to Top