రాజన్న బిడ్డ సీఎం కావాలి..పేదలకు అండగా నిలవాలి...

జననేతను కలిసిన వృద్ధురాలు సుందరమ్మ...
విజయనగరంః కురుపాం నియోజకవర్గానికి చెందిన చినతుంబలికి చెందిన వృద్ధురాలు సుందరమ్మ వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తన చిన్నకుమారుడు, మనవరాళ్లు చదువులు పూర్తి చేసినా ఉద్యోగాలు లేక కూలి పనులు చేసుకుంటున్నారని కన్నీరుమున్నీరయ్యారు. చంద్రబాబు మోసపూరిత హామీలిచ్చి నమ్మకద్రోహం చేశారన్నారు.వచ్చే ఎన్నికల్లో  వైయస్‌ జగన్‌ సీఎం కావాలని, తన లాంటి పేదలకు అండగా నిలవాలని ఆశీర్వదించారు.
 
Back to Top