స్థానిక ఎమ్మెల్యే పట్టాలివ్వకుండా అడ్డుకుంటున్నారన్నా..

వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసిన అనంతపురం జిల్లా కోగిరి గ్రామస్తులు.
శ్రీకాకుళంః అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం  కోగిరి గ్రామానికి చెందిన  దళిత కుటుంబాలు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమ  భూములకు పట్టాలివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్ళారు.జన్మభూమి కమిటీలకు అర్జీలు పెట్టినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దళితుల భూములు లాక్కొని అరాచకం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.అధికారులు కూడా పట్టించుకోవడంలేదన్నారు.కేవలం టీడీపీకి చెందినవారికే పనులు చేస్తారని వాపోయారు.వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలిచ్చే ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించారని తెలిపారు.
Back to Top