ఆదుకోండయ్యా...

శ్రీకాకుళంఃవైయస్‌ జగన్‌ను కలిసి  వీఆర్‌ఏలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయిన వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేతకు వినతిపత్రం అందజేశారు. జీతాలు కూడా సరిగా రావడంలేదని  ఆవేదన వ్యక్తం చేశారు.  వైయస్‌ జగన్‌ను కలిసిన టి.ప్రసాద్‌రావు..అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బగడ సరగంపై మినీ రిజర్వాయర్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ను పదనాపురంకు చెందిన గణపతి కలిశారు. తన మనవడు సాయి పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నాడని ఆదుకోవాలని కోరారు. సీతారామపల్లి గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిశారు.తరతరాలుగా 200 ఎకరాల భూములను సాగు చేస్తున్నామని ఇప్పుడు అధికారులు వాటిపై ఎలాంటి హక్కులు లేవంటున్నారని వాపోయారు. న్యాయం చేయాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ను కలిసిన తప్పెటగుళ్లు కళాకారులు తమకు నెలానెలా పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భానపురం పంచాయతీ పరిధిలోని 12 గ్రామాల ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమ గ్రామాలకు రోడ్లు లేవని వినతిపత్రం సమర్పించారు.

Back to Top