ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది..

వైయస్‌ జగన్‌కు శిఖబడి గ్రామ రైతుల గోడు..
విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసి శిఖబడి గ్రామ రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పంటల కొనుగోలు తెరవకపోవడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులకు తక్కువరేటుకు అమ్ముకోవాల్సి వస్తుందని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిత్లీ తుపానులో పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయామన్నారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదన్నారు. కేవలం ప్రభుత్వం అరటి రైతులకే  నామమాత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్న కనికరించడం లేదన్నారు.  రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. 
Back to Top