<br/>కృష్ణా జిల్లా: ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మహిళలు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో పొదుపు మహిళలు వైయస్‌జగన్‌ను కలిసి తమ రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని తెలిపారు.