వైయ‌స్ఆర్ భిక్ష వ‌ల్లే అనంత‌పురం డెయిరీకి పూర్వ‌వైభ‌వం

కర్నూలు :  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భిక్ష వ‌ల్లే అనంత‌పురం డెయిరీకి పూర్వ వైభ‌వం వ‌చ్చింద‌ని డైయిరీ రిటైర్డు ఉద్యోగి  ర‌మేష్ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని మంగళవారం పుట్టపాశం గ్రామంలో బ్రహ్మణ రమేష్‌, పద్మ దంపతులు ఆశీర్వదించారు. అనంత‌పురం డెయిరీలో తాను పదవీ విరమణ వరకూ ఉద్యోగం చేయగలిగానంటే అది వైయ‌స్ఆర్ చలవే అని రమేష్‌ తెలిపారు. ఉద్యోగం ఉండటం వల్లే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, పెళ్లిళ్లు చేయగలిగామని చెప్పారు. 2004లో వైయ‌స్‌ కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లైతే మా బతుకులు రోడ్డున పడేవని ర‌మేష్ అన్నారు.

Back to Top