విమర్శకు పేటెంట్ బాబుదేనట


అవును ఈమాట స్వయంగా చంద్రబాబు చెబుతున్నాడు. వైయస్ జగన్ నన్ను విమర్శించడమేమిటి? అని ప్రశ్నిస్తున్నాడు. విమర్శలు చేయడానికి పేటెంట్ రైట్స్ మేము అధికారంలోకి రాగానే వచ్చి వళ్లో పడితే మిగిలిన వారంతా విమర్శలు చేయడమేమిటి? పైగా విమర్శలకే విమర్శకుడైన విమర్శనాత్మకుడిపై చంద్రబాబుపైనే విమర్శలా? 
బాబు జన్మహక్కు
జగన్ పై నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు ఎందుకు చేస్తున్నారు. విమర్శలపేటెంట్ రైట్ తెలుగు దేశం పార్టీకి మాత్రమే ఉంది కనుక. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేని విమర్శలు చేయడం టీడీపీకీ ఆ పార్టీ అధినేతకే చెల్లింది. నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీని నోటికొచ్చినట్టు విమర్శించిన ఘనతా చంద్రబాబుదే. టెక్నాలజీకి పితామహుడినని చెప్పి, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే ఈవీఎమ్ విధానాన్ని విమర్శిస్తున్న రెండు నాల్కల సిద్ధాంతం కూడా బాబుదే. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని విమర్శించిన ఏకైక వ్యక్తి బాబుకాక ? నాడు వైయస్ హాయాంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, శంషాబాద్ ఫ్లై ఓవర్ ఇలా ప్రతి అంశాన్నీ విమర్శించబట్టే కదా ఇప్పుడు మహానేత చేసిన పనులన్నీ తను చేసినట్టు బిల్డప్ ఇవ్వగలుగుతున్నాడు. 
స్వరాష్ట్రంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనేసినా పక్క రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ సిగ్గు ఎగ్గూ లేని విమర్శలు చంద్రబాబు తప్ప వేరొకరు చేయగలరా? 
ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకుని కుల సమీకరణాలు చేసి, చివరకు ఆ పవన్ నే పిచ్చి పిచ్చిగా పచ్చ తమ్ముళ్లతో విమర్శలు చేయించే చాకచక్యం బాబుది కాక ఎవ్వరిది?
ఇన్ని మాటలేల? విమర్శ అనేది బాబు జన్మహక్కు. తాను మాత్రమే విమర్శకు అర్హుడు. అదేనండీ విమర్శ చేయడానికి అర్హుడు. తాను అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, హోదాను దిల్లీ పాదాల వద్ద తాకట్టు పెట్టినా, విభజన హామీలు గంగలో కల్పినా, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తినా, దుబారా ఖర్చులతో ఖజానాకు చిల్లు పెట్టినా మరెవ్వరూ బాబును విమర్శించరాదు. ఏమో మొన్న సిబిఐకి రాష్ట్రంలో ఎంట్రీ లేదన్నారు. నిన్న ప్రధానిని రావద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని కొన్నాళ్లుగా అరెస్టులు చేయిస్తున్నారు. సభల్లో నిరసన తెలిపితే పోలీసులతో కొట్టిస్తున్నారు. రేపు తమపై తమ పార్టీ పై విమర్శ చేస్తే ఉరి శిక్ష వేస్తామని జీవో జారీ చేస్తారేమో!!! న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని చంద్రబాబు ఎలా చేస్తాడని హాశ్చర్యపడకండి...ఆంధ్రాలో ఏదైనా సాధ్యమే...బాబు పాలనలో ఎలాంటి భ్రమలు కల్పించడమైనా సుసాధ్యమే. 
 
Back to Top