1.విలేకరులు- రేవంత్‌రెడ్డి చెప్పిన బాస్ మీరేనాజవాబు- బాస్ అనే మాట ఎవర్నయినా అనోచ్చు. ఎంతో మందిని సరదాగా బాస్ అంటాం. అంటే అతను మన బాస్ అని అర్థమా?ఆయనలో ఉన్నట్టుండి అపరిచితుడు ప్రవేశించాడు. మనిషి వూగిపోయి జుత్తుపీక్కొని, గడ్డం గోక్కునిఅపరిచితుడు- బాస్ అంటే నేనుకాక ఇంకెవరు..........ఇంకొకర్ని బాస్ అనే ధైర్యం రేవంత్‌కుందా? పార్టీ లో నేనే బాస్.సింగిల్ బాస్...
2. విలేకరులు జడుసుకొని- అంటే ఆ గొంతు మీదేనాఅపరిచితుడు మళ్లీ ఆయనగా మారి-- గొంతుని ఇంగ్లీష్‌లో టోన్ అంటారు, ఇంతకూ ఆ టేపులో వున్నది ఎవరి గొంతుమళ్లీ అపరిచితుడు- ఈ రాష్ట్రంలో వున్న బచ్చాగాళ్ళకు కూడా తెలుసు అది నా గొంతేనని...అవును అది నా గొంతే నాకు గాకుండా ఎమ్మెల్యేలను కొనే ధైర్యం మా పార్టీలో ఇంకెవరికైనా వుందా? నరుకుతా, చంపుతా నాగొంతుని ఇంకెవడైనా విప్పితే
3. విలేకరులు- అంటే యాభై లక్షలు ఇచ్చి పంపింది మీరేగా బాబు- యాభై లక్షలా? యఆభై లక్షలకు ఎన్ని సున్నాలుంటాయి?అపరిచితుడు- రేయ్......రేయ్ మీకు కళ్ళు దొబ్బాయా...........నోట్ల కట్టలు రేవంత్ తీసి చూపించాడు కదా అయినా నోట్ల కట్టలు ఎవరివి? ఎక్కడి నుండి వచ్చాయి...............ఇవేం ప్రశ్నలు..........డబ్బెక్కడ నుంచి వచ్చింది కాదన్నయ్యా...............ఎమ్మెల్యేని కొంటున్నమా లేదా అన్నది పాయింట్ 4.విలేకరులు- అయినా మీరు నీతినిజాయితి గురించి మాట్లాడుతారుఆయన-నీతిమా ఇంటి పేరు......నిజాయితి మా పార్టీ పేరు........ఇన్నాళ్ళుగా కొన్ని విలువలలే రాజకీయం చేస్తున్నాను..........విలువలే ఆస్తి ఈ సన్నాఫ్ నారప్పనాయుడికిఅపరిచితుడు- నీతా? అది నా ఇంటావంటాలేదు, నిజాయితి అనే పదం తెలుగులో నాకునచ్చని ఏకైక పదం............ఆరెకరాల నుంచి వేలకోట్లకు వచ్చానంటే అది అవినీతి వల్లే...............అన్నింటికి విలువ కట్టడం నా హాబీ......అందుకే ఎమ్మెల్యే విలువ ఐదుకోట్లు
5. విలేకరులు- మరి వాస్తవాలు ఒప్పుకోకుండా టేపుని కట్ పోస్ట్ అంటున్నారు.బాబు- మమ్మల్ని వేధించడానికి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.................ఇదంతా కక్షఅపరిచితుడు- కట్ లేదు టూత్ పేస్ట్ లేదు ఫోన్ ట్యాప్ లేదు, కక్ష శిక్ష అసలు లేదు. అయినా నిజాయితీగా మాత్రం ఏం దొరుకుతుంది నారింగ్ టోన్ తప్ప..........టోన్ దొరికిందంటే మనం మాట్లాడామనే అర్థం
6. విలేకరులు- మీరు రెండు రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నారు.బాబు- నేనెప్పుడు ఒకటే రకంగా మాట్లాడలేను.........వేళ్ళు రెండు చూపిస్తానంతేఅపరిచితుడు-నేను పదారు రకాలుగా కూడా మాట్లాడగలను.ఎన్టీయార్‌ని తిట్టిన నోటితోనే పొగడగలను......జూనియర్ ఎన్టీయార్‌ని పొగిడి............కరివేపాకులా దూరం పెట్టగలను.................నేను అదో టైపు
విలేకరులు- మీరిప్పుడు ఆడియో టేపులో చిక్కున్న ఎలకగమనిక- ఇక్కడ జవాబులు ఇచ్చింది ఎవరు..అపరిచితుడు ఎవరు అని అడగవద్దని మనవి.

- రాహుల్