రేపు ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప‌రామ‌ర్శించ‌నున్నారు. శుక్ర‌వారం ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్క‌డి నుంచి అనకాపల్లిలో క్ష‌త‌గాత్రులు చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి చేరుకొని వారిని పరామర్శించిన అనంతరం తిరుగు పయనమవుతారు.

Back to Top