ఇందిరా దేవి మరణం బాధాకరం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి: సూపర్‌స్టార్‌ కృష్ణ గారి  సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరా దేవి గారి అకాల మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఇందిరా దేవి గారి మరణం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top