అమ‌రావ‌తి అభివృద్ధికొచ్చిన న‌ష్ట‌మేమీ లేదు

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల అమ‌రావ‌తి అభివృద్ధికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని విషయంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. 'వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి ఏఎమ్‌ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు' అని ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top