రాజమహేంద్రవరం: ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఎందుకు ఐటీ శాఖపై పరువు నష్టం దావా వేయడం లేదని నిలదీశారు. ఐటీ నోటీసులపై టీడీపీ ఏం సమాధానం చెబుతుందన్నారు. రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు ఇస్తూ హైదరాబాద్‌లో అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు. ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేసి మాట్లాడే ఘనుడని మండిపడ్డారు. పేదలకు కట్టాల్సిన ఇళ్ల నిర్మాణాల్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రశ్నించారు. టెంపరరీ సెక్రటేరెట్‌కు స్వై్కర్‌ఫీట్‌కు రూ.14 వేలు ఖర్చు చేశారు. రూ.3 వేలు ఖర్చు చేసి మిగతా డబ్బు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు పంపించారు. ఇవాళ పార్లమెంట్ భవనాన్ని టాటా కంపెనీ తక్కువ ధరకే కట్టారు. తెలంగాణలో కూడా ఈమధ్య సచివాలయాన్ని ఐకానిక్ బిల్డింగ్‌లా కట్టారు. చంద్రబాబు మాత్రం అమరావతిలో రేకులషెడ్డు నిర్మించి దోచుకున్నాడు. చంద్రబాబు తనయుడు లోకేష్ మిడ్ నైట్లో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్ నోరు తెరవాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు.