సీఎం వైయస్‌ జగన్‌పై రాజకీయ కుట్ర జరుగుతోంది

కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రిపై ఆరోపణలు

సీఎం వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా ఎల్లోమీడియా, టీడీపీ కుట్ర

హత్య కేసులో ముద్దాయి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటీ..?

గొడ్డలితో నరికానని దస్తగిరి చెప్తుంటే సునీతమ్మ ఎందుకు మౌనంగా ఉంది..?

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని టార్గెట్‌ చేయడం చంద్రబాబు ఆడిస్తున్న రాజకీయ కుట్ర

వివేకా రాసిన లెటర్‌ను దాచిపెట్టాలని ఎవరు చెప్పారు..? ఎందుకు దాచిపెట్టారు..?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు 

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, కుట్రలో అంతర్భాగమే వివేకా హత్య కేసు ఆరోపణలు అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ విచారణ జరుగుతుంటే హత్య కేసులో ముద్దాయి మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటీ..? గొడ్డలితో నరికానని ఒప్పుకున్న ముద్దాయి గంటల కొద్దీ మీడియా ఛానళ్లకు లైవ్‌ ఇస్తున్నాడంటే.. ఇలా చంపాను అని చెబుతున్నాడంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

వివేకానందరెడ్డిని గొడ్డలితో తానే నరికానని దస్తగిరి చెప్తుంటే సునీతమ్మ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దస్తగిరికి బెయిల్‌ రావడాన్ని ఎందుకు ఆక్షేపించడం లేదు, జైల్లో పెట్టాలని ఎందుకు డిమాండ్‌ చేయడం లేదు..? దీనిపై కూడా విచారణ చేయాలని సీబీఐని డిమాండ్‌ చేశారు. సునీతమ్మ భర్తకు ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్నామని, ఆయనకు ఎప్పటి నుంచో రాజకీయంగా రాణించాలనే కాంక్ష ఉంది.. దానిపై ఎందుకు సీబీఐ విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.  

వైయస్‌ వివేకా హత్య కేసులో చంద్రబాబు తొలి ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలోనే వివేకా హత్య జరిగిందని గుర్తుచేశారు. హత్య జరిగిన మూడు నెలల కాలం టీడీపీ అధికారంలో ఉందని,  మూడు నెలల కాలంలో ప్రాథమికంగా టీడీపీ బృందాలు, ఆనాటి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ చేసిన విచారణ ఏంటీ..? ఎవరెవరిని నిందితులుగా చేర్చారు..? అప్పుడెందుకు ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, వైయస్‌ భాస్కర్‌రెడ్డి పేర్లు రాలేదని ప్రశ్నించారు. బాధితులను ముద్దాయిలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా వైయస్‌ వివేకానందరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా బీటెక్‌ రవి నిలబడ్డారు. ఎన్నికల్లో అలవోకగా గెలవాల్సిన వివేకానందరెడ్డి ఓడిపోయారు. ఆనాటి టీడీపీ మంత్రి, ఇప్పటి బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ, టీడీపీ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ తరఫున నిలబడ్డాడు. కుట్ర ఎక్కడ జరిగింది..? హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో సీబీఐ ఆలోచన చేయాలి. ఇన్ని రోజుల తరువాత ఈ విధంగా బాధిత కుటుంబ సభ్యులనే టార్గెట్‌ చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని టార్గెట్‌ చేయడం చంద్రబాబు ఆడిస్తున్న రాజకీయ కుట్రగా భావిస్తున్నామన్నారు. 

వైయస్‌ వివేకా రాసిన లెటర్‌ను దాచిపెట్టాలని ఎవరు చెప్పారు..? ఎందుకు దాచిపెట్టారు..? ఆ కోణంపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. గూగుల్‌ టేక్‌ అనే దానికి చట్టప్రకారం, సాంకేతిక ప్రకారం విలువ లేదన్నారు. వివేకా చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చిన వైయస్‌ అవినాష్‌రెడ్డినే నిందితుడిని చేర్చే కుట్ర చేస్తున్నారని, బాధితులను ముద్దాయి చేస్తున్న చరిత్ర చూస్తున్నామన్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధుల సేకరణ కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లడం సాధారణమని, సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడల్లా టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 
 

Back to Top