సీఎం సహకారంతో తిరుపతి సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది

తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ మూడవ దశ నిర్మాణం పూర్తి

ట్రయల్‌ రన్‌ నిర్వహించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ సహకారంతో తిరుపతి  సరికొత్తగా అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో నూతన నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ మూడవ దశ పనులు పూర్తయ్యాయి. తిరుచానూరు మార్కెట్‌ యార్డు నుంచి లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్‌ నుంచి రేణిగుంట రోడ్డు మార్గం ఫ్లైఓవర్‌ పూర్తయింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌పై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తోందన్నారు. మొత్తం 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌లో ఈరోజుతో 6 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. మిగిలిన ఒక్క కిలోమీటర్‌ పనులు కూడా త్వరలో పూర్తవుతాయన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తొందరలోనే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ఫ్లైఓవర్‌ తిరుపతి ప్రజలకు, తిరుమలకు వెళ్లే భక్తులకు ఉపయోగపడుతుందని చెప్పారు. 
 

Back to Top