తప్పు చేస్తే సస్పెండ్‌ చేయక.. సన్మానాలు చేస్తారా..

ఓ అధికారి సస్పెన్షన్‌ను జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్న బాబు, పచ్చమీడియా

జాస్తి కృష్ణకిషోర్, చంద్రబాబు మధ్య రహస్య లింకులు ఉన్నాయి

డిప్యూటేషన్‌పై జాస్తి కృష్ణకిషోర్‌ను ఎందుకు తీసుకువచ్చారు

ఆ అధికారిని ప్రొటెక్టు చేస్తున్నారో సమాధానం చెప్పాలి

చంద్రబాబును మించిన ఉన్మాది రాష్ట్రంలో ఎవరూలేరు

నీతివంతమైన పాలన అందించడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

ఆ ప్రయాణంలో తప్పు చేసిన అధికారులకు సస్పెన్షన్‌ తప్పదు

వయస్సు పెరగడం కాదు.. సంస్కారం పెంచుకో చంద్రబాబూ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ఐఆర్‌ఎస్‌ అధికారి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి మండలి మాజీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ను చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. తప్పు చేసిన అధికారిని సస్పెండ్‌ చేయకుండా.. సన్మానాలు చేస్తారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు. పరిశ్రమ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా జాస్తి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని, తప్పు చేసిన అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ జరపడం కొత్తేమీ కాదన్నారు. కానీ, చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలు అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్‌ చేశారని పుంకాలు పుంకాలుగా కథనాలు రాస్తున్నాయన్నారు. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడలేని చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌ గురించి కక్షసాధింపు అని మాట్లాడారంటే.. ఆ అధికారికి, చంద్రబాబుకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఏం మాట్లారంటే.. ‘ఈ నెల 12వ తేదీన ఐఆర్‌ఎస్‌ అధికారి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి మండలి సీఈఓగా పనిచేసి మాజీ అయిన జాస్తి కృష్ణకిషోర్‌పై కొన్ని ఆరోపణలు వస్తే.. పరిశ్రమల శాఖ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారిని సస్పెండ్‌ చేసింది. సహజంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు సస్పెండ్‌ చేసి విచారణ జరుపుతాయి. ఇదేమీ ప్రభుత్వాలకు, అధికారులకు కొత్తేమీ కాదు. కానీ, ఇది చాలా పెద్ద సమస్యగా, రాష్ట్ర, జాతీయ సమస్యగా చంద్రబాబుకు అనుకూలమైన పత్రికలు అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్‌ చేశారని పుంకాలుగా కథనాలు రాస్తున్నాయి. దానికి తోడు చంద్రబాబు కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి ఇది కక్షసాధింపు చర్య.. చాలా అన్యాయం అని స్టేట్‌మెంట్‌ ఇచ్చి పెద్ద సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్‌ చేయక.. సన్మానాలు చేస్తారా..?
 
గత ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిని అంతం చేయాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆధారాలు ఉంటే అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ చేస్తుంది. విచారణలో రుజువు అయితే రిమూవ్‌ కూడా చేస్తుంది. దీనికి చంద్రబాబు జాస్తి కృష్ణకిషోర్‌ను ప్రొటక్టు చేయాలని తాపత్రయ పడుతున్నారు.

గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా జాస్తి కృష్ణకిషోర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాబట్టి గతంలో జగతి పబ్లికేషన్‌ కేసుల విచారణ టీమ్‌లో ఈయన సభ్యుడిగా ఉన్నాడని, జగతి పబ్లికేషన్‌ షేర్లు ప్రీమియం రేట్ల మీద వివాదం అయింది కాబట్టి దానిపై విచారణ జరిపి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చాడని కక్షసాధింపు చర్యగా సస్పెండ్‌ చేశారని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో కొంత బండారం బయటపడుతుంది. చంద్రబాబు ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను  రాష్ట్రానికి ఎందుకు తీసుకువచ్చారు. తప్పు చేసి సస్పెండ్‌కు గురైన అధికారిని ప్రొటక్టు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడంటే.. జగతి పబ్లికేషన్‌ విచారణ టీమ్‌లో సభ్యుడిగా ఉండి బహుశా బాబుకు అనుకూలంగా ప్రవర్తించి అయినా ఉండాలి.. బాబుకు అప్పటి నుంచి టచ్‌లో ఉండొచ్చు. బాబు ఏం చెబితే అది చేసి ఉండొచ్చు. అలా చేశారు కాబట్టే ఆ అధికారిని రాష్ట్రానికి డిప్యూటేషన్‌ మీద తీసుకువచ్చారా..? డిప్యుటేషన్‌ మీద తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఆయనకు, బాబుకు రహస్య లింకులు ఉన్నాయని చంద్రబాబే అంగీకరించాడు.

జగతి పబ్లికేషన్‌ విచారణ టీమ్‌లో ఉండి చంద్రబాబుకు అనుకూలంగా ప్రవర్తించడం వల్లే ఆ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చాడనే భావన కలుగుతుంది. ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటే యాక్షన్‌ తీసుకోవడం ప్రభుత్వ లక్షణం. సీఎం వైయస్‌ జగన్‌ ఒక మంచి పరిపాలన, నీతివంతమైన పాలన అందించాలనే క్రమంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి వారిని సస్పెండ్‌ చేసి విచారణ జరుపుతారు.

జాస్తి కిషోర్, జేడీ లక్ష్మీనారాయణ, వెంకయ్యచౌదరి వీళ్లందరినీ తన కనుసన్నల్లో పనిచేసే విధంగా చంద్రబాబు చేసుకున్నారు కాబట్టే ఆ రోజున వైయస్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత వైయస్‌ జగన్‌పై కేసులు రావడానికి కారణం ఎవరూ.. 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టించింది మీరు కాదా చంద్రబాబూ..? ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్‌ చేశారంటే.. వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకొని హైకమాండ్‌ను కాదని యాత్రకు వెళ్తుంటే ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సోనియాగాంధీతో చేతులు కలిపి కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ పరియావసానమే ఈ జగతి పబ్లికేషన్‌ కేసులు, వైయస్‌ జగన్‌ జైలుకు వెళ్లడం, ఆ రోజున సోనియాగాంధీతో కలిసి పనిచేసిన దుర్మార్గపు రాజకీయ వేత్త నువ్వు కాదా చంద్రబాబూ..?

రోశయ్య తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వస్తే కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి   సరైన బలం కూడా లేదు. అనేకమంది ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌ సీపీకి మద్దతు పలికి అవిశ్వాస తీర్మానం పెడితే.. ఆ రోజున చంద్రబాబు కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి కాపాడారు. ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీని కాపాడే నీచమైన రాజకీయాలు చేసి వైయస్‌ జగన్‌పై కక్షసాధింపు చర్యలు చేసిన సందర్భాన్ని ప్రజలు మర్చిపోలేదు.

వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టి సీబీఐ ఎంక్వైరీ వేయించి ఏదో గందరగోళం చేయాలని, అణచివేయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇవాళ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఒక అధికారి తప్పు చేసి సస్పెండ్‌కు గురైతే.. ఆ అధికారి ఆ రోజున టీమ్‌లో ఉన్నాడని బయటపెట్టి కక్షసాధింపు అని మాట్లాడుతున్నారు. కక్షసాధింపు ఈ ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అంతకంటే లేదు. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గమనించాలి.

పత్రికలు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇదే పెద్ద సమస్యగా రాస్తున్నారు. ఆ రోజున కూడా జగతి పబ్లికేషన్‌కు సంబంధించి సాక్షిని ఎదుర్కోవడానికి చంద్రబాబు∙గందరగోళం చేశారు. అనుకూల మీడియాతో పుంకాలుగా కథనాలు రాయించారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు, కక్షసాధింపు అలవాటు చంద్రబాబుకు ఉంది.
అనుకూలమైన అధికారులను కీపోస్టుల్లో వేసుకొని, డిప్యుటేషన్‌ మీద తెచ్చుకొని అన్యాయాలు, అక్రమాలు చేసే ప్రభుత్వంగా చంద్రబాబు పాలన మిగిలిపోయింది.. అందువల్లే ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారు.

జాస్తి కృష్ణకిషోర్, జేడీ లక్ష్మీనారాయణ ఇలాంటి వ్యక్తులతో వేధించాలనో.. మరోటి చేయాలనేది చేసి కక్షసాధింపులుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించలేరు. ప్రజలకు సమస్యలు ఉన్నాయి.. ఆ సమస్యలపై స్పందించండి. ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇలా ఏది పడితే అది మాట్లాడి ప్రజలను నమ్మించాలని కక్షసాధింపు చర్యలు అని మాట్లాడి చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు.. సహించరు. చంద్రబాబు పిచ్చి ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా.. నీతివంతమైన పాలనతో ముందుకు వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం భావిస్తుంది.

శాసనసభలో శాంతిభద్రతల పరిరక్షణకు నియమించిన మార్షల్స్‌పై చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. బహుశా బ్యాలెన్స్‌ తప్పి ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారు.. అధికారం రాలేదు.. ఒక్కగానొక్క కుమారుడు రాజకీయాల్లోకి తీసుకొస్తే గెలవలేకపోయాడనో.. ప్రయోజకుడు కాలేకపోయాడు.. మళ్లీ తిరిగి అధికారం రాదేమో అనే భయాందోళన మధ్య ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు ఉన్నట్లుగా అర్థం అవుతుంది. ఎప్పుడూ లేని విధంగా భూతులు మాట్లాడే పరిస్థితికి చంద్రబాబు వచ్చారు. ఈ రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్రపోషించానని చెప్పుకునే వ్యక్తి భూతులు మాట్లాడడం చాలా బాధాకరమైన అంశం.

అమరావతి పర్యటనలో ఏం పీకారు.. మొన్న  శాసనసభలో మార్షల్స్‌ అడ్డుకుంటే బాస్టర్డ్‌ అనే పదాన్ని ఉపయోగించారు. మళ్లీ నేను అనలేదు అంటున్నాడు.. నూటికి నూరుపాళ్లు ఆ మాట చంద్రబాబు అన్నారు. అలవాటు ప్రకారం సభలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించండి అంటున్నాడు. స్పష్టంగా వినిపిస్తే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం ఏముంది. ఫ్రస్టేషన్‌లో ఉన్న చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 70 ఏళ్లు వచ్చినా 25 ఏళ్లు అని చెప్పుకుంటున్నారు కానీ అది ఆచరణలో లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని అడ్డుకునే అధికారం మార్షల్స్‌కు ఉందా అని మాట్లాడుతున్నాడు.. 14 ఏళ్లు అయినా 30 ఏళ్లు అయినా చట్టానికి లోబడి చేయాలి.. జరగకూడనిది జరిగి ఏదైనా ఆయుధం లోనికి వెళ్లే దానికి సమాధానం చెప్పాల్సింది మార్షల్స్‌ కాదా..

14 ఏళ్ల ముఖ్యమంత్రిని ఎయిర్‌పోర్టులో ఎందుకు చెక్‌ చేశారు.. అక్కడా ఇలాగే అడుగుతారా..? మార్షల్‌ పట్ల ఇష్టారీతిగా మాట్లాడి.. మెడపట్టుకొని గెంటే విధంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఉన్మాది అంటున్నాడు.. ఒకసారి కాదు వందసార్లు అంటాను అంటున్నాడు.. కానీ ప్రజలు మిమ్మల్ని ఎంత చీదరించుకుంటున్నారో ఆలోచించండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, 151 సీట్లు గెలుచుకున్న వ్యక్తిని, 50 శాతం పైచిలుకు ఓట్లు సాధించని వ్యక్తిని ఉన్మాది అని అంటున్నారంటే అది మీ సంస్కారహీనం. చంద్రబాబు కంటే ఉన్మాదులు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. అధికారం కోల్పోయి ఉన్మాదత్వంతో ప్రవర్తిస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారు. వయస్సు పెరగ్గానే సరికాదు.. సంస్కారం పెంచుకో’వాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు.  

Back to Top