కోడెల మృతికి కుటుంబ సభ్యులు..చంద్రబాబే కారణం

కోడెల మరణం వెనుక మిస్టరీ ఉంది

సీనియర్‌ నేత మరణిస్తే టీడీపీ శవ రాజకీయాలు చేస్తోంది

కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి..వ్యక్తిగత ప్రత్యర్థి కాదు

కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నేతలు..మేం కాదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని, వ్యక్తిగత ప్రత్యర్థి కాదన్నారు. ఓ సినియర్‌ నేత చనిపోతే టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కోడెల మృతి వెనుక మిస్టరీ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

 మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కూడా ప్రభుత్వ హత్య అని మాట్లాడుతున్నారు. సాక్షాత్తు నారా చంద్రబాబు రంగంలోకి దిగి వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని, దేశంలోనే ఇలాంటి సంఘటన లేదని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ మరణాన్ని అంతా కూడా వైయస్‌ జగన్‌ మీద, వైయస్‌ఆర్‌సీపీపై రుద్ది ఒక సింపథీ పొందాలని, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎదుటివారి క్యారెక్టర్‌ను భయటపెట్టవచ్చు అని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా నాలుగు సార్లు మీడియా ముందుకు వచ్చారు. చెప్పిందే చెప్పి..ఏదో విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కోడెల ఆత్మహత్య ఆత్మహత్య కాదు...ప్రభుత్వ హత్య అని బ్రాండ్‌ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాజకీయాల్లో అతి నీచమైన కార్యక్రమం.

కోడెల మరణించడం చాలా బాధాకరం. ఎవరైనా మరణిస్తారు. కోడెల వంటి దూకుడుగా వ్యవహరించే నాయకుడు..ఎన్‌టీఆర్‌ పిలుపునందుకొని ఇప్పటివరకు అనేక విజయాలు అందుకున్నారు. అనేక క్లిష్టపరిస్థితుల్లో నిలబడి ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు కేసులు పెట్టినా ఎప్పుడు బెదరలేదు. రాటుతేలిన రాజకీయ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా ఆశ్చర్యం. ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి.  ఇది వాస్తవమేనా? ఆయన ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాడని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే ఆయన ఉరితాడు వేసుకొని మరణించాడని తెలుస్తోంది. పల్నాడి పులి అనిపించుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? చంద్రబాబు కోణం ఇందులో దుర్మార్గంగా ఉంది. మేం రాజకీయాల్లో ఘాటైన విమర్శలు చేస్తాం. మేం కేసులు పెట్టామా? వైయస్‌ జగన్‌ కేసులు పెట్టారా? 19 కేసులు పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ కేసులన్నీ కూడా టీడీపీ నేతలే పెట్టారు. కేసు పెడితే పోలీసులు రిజిస్ట్రర్‌ చేసి దర్యాప్తు చేస్తారు. అవసరమైతే అరెస్టు చేస్తారు. ఇందులో ఒక్క కేసులోనైనా అరెస్టు చేశారా? ఎవరైనా పోలీసులు ఆయన్ను సంప్రదించారా? కోడెల హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది. ఇందులో ఏదో ఒక మిస్టరీ దాగి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ మరణంపై చర్చ జరగాలి. ఈ మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులే. టీడీపీ రెండో కారణమని అందరూ అంటున్నారు. కోడెల ఓటమి తరువాత ఆయనపై కేసులు పెడితే టీడీపీ నాయకులు ఒక్కరూ కూడా సపోర్టు చేయలేదు. ఎందుకు పార్టీ పట్టించుకోలేదు? ఇది కోడెల మదిలో మదిలిన ప్రశ్న. 1983లో ఎన్టీఆర్‌ పిలుపుతో వచ్చిన నాయకుడు కోడెల. ప్రారంభం నుంచి టీడీపీలోనే ఉన్నారు. పక్క పార్టీ వైపు కూడా తొంగి చూడలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చంద్రబాబు ఆదేశాల మేరకు కోడెల వారిపై అనర్హత వేటు వేయలేదు. మేం ఆరోపణలు చేస్తే చంద్రబాబు ఏ నాడు కూడా ఖండించలేదు. వర్లా రామయ్యను పంపించి ఏం మాట్లాడారు. ఆగస్టులో గుండెపోటుతో కోడెల జాయిన్‌ అయితే ఎవరు పట్టించుకోలేదు. వాస్తవానికి అది గుండెపోటు కాదు..దాన్ని కప్పిపెట్టారు. లక్ష్మీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి 50 మీటర్ల దూరంలోనే టీడీపీ ఆఫీస్‌ ఉంటుంది.

నాలుగు సార్లు టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన చంద్రబాబు ఒక్కసారి కూడా వెళ్లి కోడెలను పరామర్శించలేదు. టీడీపీ నేతలు వెళ్లి చంద్రబాబును బతిమాలినా కూడా ఆయన వెళ్లలేదు. టీడీపీ కార్యకర్తలు జరిగిన కార్యక్రమాలపై అంతర్‌మధనం చేసుకోండి. కాపాడుకోవాల్సిన నాయకుడే అవమానించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచక పులిలాగా బతికిన కోడెల ఆత్మహత్య చేసుకుంటే వైయస్‌ జగన్‌పై నెపం నెట్టుతారా? వైయస్‌ జగన్‌పై కేసులు లేవా? మాపై కేసులు నమోదు కాలేదా?. బతికున్నప్పుడు పలకరించని చంద్రబాబు ఇప్పుడు బావురు బావురుమంటూ ఏడ్చినట్లు నటిస్తున్నారు. రాయపాటి రంగబాబును ప్రోత్సహించి కోడెలను అవమానపరిచింది వాస్తవం కాదా? కోడెలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రచారం చేసింది నిజం కాదా? రాజకీయ లబ్ధి కోసం కోడెల శవంపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు కోడెలను ఎందుకు పలకరించలేదో సమాధానం చెప్పాలి.

కోడెల కుటుంబంపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే ఆయన కుమారుడు, కుమార్తెలను నరసరావుపేట, సత్తెనపల్లెకు ఇన్‌చార్జ్‌లుగా చేయండి. అంతేకాని మాపై విమర్శలు చేయడం సరికాదు. కోడెల మరణానికి కారణం చంద్రబాబు, కోడెల కుటుంబ సభ్యులే. మాపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నించడం దుర్మార్గం. గుంటూరు జిల్లాలోని ఎస్సీలు మోస్టు సిన్సియర్లు. వారి రికార్డులు చూసుకోండి. 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఎన్ని కేసులు పెట్టారు. ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా? విశాఖకు వెళ్తే వైయస్‌ జగన్‌ను, తనను రన్‌వేపై ఆపేసింది గుర్తు లేదా?. కోడెల మరణానికి టీడీపీ బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మాపై బురద జల్లే కార్యక్రమాలను చంద్రబాబు మానుకోవాలి. ఎల్లోమీడియా ద్వారా జరుగుతున్న గ్లోబెల్‌ ప్రచారాన్ని నమ్మకండి అంటూ ప్రజలను కోరుతున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top