మంగళగిరి: మంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డిని బైక్ తో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటనలో హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణమండపం రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి మోటార్ బైక్ లతో అల్లరి చేస్తున్నటిడిపి కార్యకర్తలను ఏంటి అల్లరి చేస్తున్నారని ప్రశ్నించడం...దానికి ఆగ్రహించిన వారు ఆ బైక్ తో వేగంగా ఢిీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వెంకటరెడ్డిని మణిపాల్ ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఈరోజు బ్రెయిన డెడ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు వెంకటరెడ్డిని చూసి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. అల్లరిచేస్తున్న టిడిపి వారిని అలా చేయవద్దని అన్నందుకు వేగంగా బైక్ తో ఢీకొట్టించి హత్యాయత్నం దారుణం అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన పని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యపధ్దతిలో చేయాలని ఈ విధంగా హత్యాయత్నాలు చేయడం దారుణం అన్నారు. దీనిపై పోలీసు అధికారులు వెంటనే జోక్యంచేసుకుని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో లోకేష్ రెండోసారి ఓడిపోతాననే భయంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఇలా హత్యాయత్నం సంఘటనలు జరగలేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో తిరిగి ఘన విజయం సాదించబోతోందని తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ లు ఇలాంటివాటికి పాల్పడేలా చేస్తున్నారని ఆరోపించారు. వెంకటరెడ్డి ని బైక్ తో వేగంగా ఢిొకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడని,తాము పరామర్శించిన సమయంలో డాక్టర్లు ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారని..కుటుంబసభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లోకేష్ ఓటమి ఖాయం కావడంతో ఏమిచేయాలో పాలుపోని స్దితిలో ఇలాంటి దుర్మార్గాలకు తెగబడుతున్నారని అన్నారు.దాడి చేసిిన సందర్భంలో జై తెలుగుదేశం,జై లోకేష్ అంటూ నినాదాలు చేసి తమ వికృతమనస్తత్వాన్ని చాటుకున్నారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు చాలా సంయమనంతో ఉన్నారని అన్నారు. ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలని,విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇటీవల కొందరు ఐఏఎస్, ఐపిఎస్ లపై పదే పదే ఫిర్యాదులు చేయడం వారి బదిలీల నేపధ్యంలో లోకేష్ తనకు ఎదురేలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వెంకటరెడ్డి ఘటనలో బాధ్యలను వెంటనే అరెస్ట్ చేయాలని లేదంటే తాము కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టాల్సి వస్తుందని తెలియచేశారు.