చంద్రబాబు కనిపించడం లేదంట.. దానికి సమాధానం చెప్పండి

లోకేష్, టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మండిపాటు

తాడేపల్లి: నాలుగు రోజులుగా ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదని లోకేష్, టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, 40 ఏళ్లుగా కుప్పంలో చంద్రబాబు కనిపించడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారని ముందు దానికి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్‌ చేశారు. వ్యక్తిగత పనులతో నాలుగు రోజులుగా బిజీగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 20వ తేదీ ఉదయం పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ వెళ్లానని, చాలా సంవత్సరాల తరువాత మా ఇంట్లో వివాహం జరుగబోతుందని, ఆ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. 17వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని, అప్పడి నుంచి 20వ తేదీ వరకు మంగళగిరిలోనే ఉన్నానన్నారు. వ్యక్తిగత పనుల మీద నాలుగు రోజులు హైదరాబాద్‌కు వెళ్తే లోకేష్, టీడీపీ నేతలు కనిపించడం లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, చంద్రబాబు 40 ఏళ్లుగా కుప్పంలో కనిపించడం లేదని అక్కడి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, చంద్రబాబుకు కుప్పంలో క్యాంపు ఆఫీస్‌ కూడా లేదని వారే చెబుతున్నారన్నారు. లోకేష్, టీడీపీ నేతలు ముందుగా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వమని ఆర్కే చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top