విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై దళిత నేతల హర్షం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి ద‌ళిత నేత‌ల పాలాభిషేకం

విజయవాడ:  విజయవాడ నడిబొడ్డున బార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకుని, శంకుస్థాప‌న చేయ‌డం ప‌ట్ల ద‌ళిత నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ..ఆయ‌న చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్నారు.ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ ‌సీపీ దళిత నేతలు కనకరావు మాదిగ, మధుసూదన్‌రావు, అమ్మాజీ, పద్మజ మాట్లాడుతూ..  125 అడుగుల అంబేద్కర్  విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు. చంద్రబాబు ఊరు చివర అంబేద్కర్ విగ్రహం పెడతానని మోసం చేశార‌ని, సీఎం వైయ‌స్ జగన్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నార‌ని తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్ మాట ఇచ్చారంటే అంబేద్కర్ విగ్రహం కట్టించి తీరుతార‌ని దీమా వ్య‌క్తం చేశారు.  కోర్టుల్లో కేసులు వేయించి అంబేద్కర్ విగ్రహం  ఏర్పాటును అడ్డుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ద‌ళిత నేత‌లు అనుమానం వ్య‌క్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top